'దిశ' సినిమా: శంషాబాద్ ఎసీపీని తో చర్చించిన RGV
- February 17, 2020
గత ఏడాది చివర్లో దేశ వ్యాప్తంగా దిశా హత్య కేసు ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. షాద్ నగర్ సమీపంలో... డాక్టర్ గా పని చేస్తున్న దిశాని నలుగురు యువకులు అపహరించి ఆమెను అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసారు. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో అ౦దోళనలు వ్యక్తమయ్యాయి. నిందితులను కఠినం గా శిక్షించాలి అంటూ అప్పుడు విద్యార్ధులు, మహిళలు ఇలా ప్రతీ ఒక్కరు రోడ్ల మీదకు వచ్చారు. ఆ తర్వాత నిందితులను గంటల వ్యవధిలో గుర్తించిన తెలంగాణా పోలీసులు వారిని అరెస్ట్ చేసారు.
ఆ తర్వాత వారికి కోర్ట్ రిమాండ్ విధించగా విచారణ సమయంలో ఘటనా స్థలి వద్ద వారు తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు కాల్చి చంపారు. జోల్లు శివ, చెన్నకేశవులు, జొల్లు నవీన్, మహ్మద్ ఆరిఫ్ అనే ఆనలుగురు నిందితులు దిశా ని అత్యంత పాశవికంగా పెట్రోల్ పోసి తగులబెట్టారు. దీనితో ఒక్కసారిగా మహిళల భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. ఈ దారుణ ఘటనతో దేశ వ్యాప్తంగా అమ్మాయిలు రోడ్ల మీదకు రావాలి అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అన్ని వర్గాలు దీన్ని తీవ్ర స్థాయిలో ఖండించాయి.
అయితే ఈ ఘటనపై ఇప్పుడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తియ్యాలని నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఈ సినిమాకు సంబంధించిన కథ కోసం ఆయన నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుకను ఇప్పటికే కలిసాడు. ఇక ఇప్పుడు శంషా బాద్ ఏసీపీని కూడా కలిసారు. సోమవారం ఆఫీస్ కి వెళ్ళిన ఆయన... ఏసీపీని కలిసి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక నిందితులకు సంబంధించిన కొంత సమాచారాన్ని కూడా ఆయన పోలీసుల నుంచి సేకరించారు. ఈ సినిమాను మే చివరి వారం లేదా జూన్ మొదటి వారం నుంచి మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







