దుబాయ్ లో విషాదం...భార్యను కాపాడే క్రమంలో
- February 17, 2020
దుబాయ్ : అగ్ని ప్రమాదం నుంచి భార్యను కాపాడే క్రమంలో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేరళ కు చెందిన వ్యక్తి సోమవారం మృతి చెందారు. కేరళకు చెందిన అనిల్(32) మంటల్లో చిక్కుకున్న తన భార్య నీను రక్షించే క్రమంలో వీరిద్దరూ గత సోమవారం అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్థానికులు ఈ దంపతులను దుబాయ్‌లోని స్థానిక ఆసుపత్రికి తరలించగా 90 శాతం కాలిన గాయలతో చికిత్స పొందుతున్న అనిల్ నేడు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. 10 శాతం గాయాలైన ఆయన భార్య నీను ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యలు వెల్లడించారు. కాగా ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడని.. ఈ ఘటనలో బాలుడు కూడా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
దుబాయ్‌లోని ఉమ్ అల్ క్విన్‌లో అనిల్ తన భార్య, కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గత సోమవారం వారి అపార్టుమెంటులోని కారిడార్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మంటల్లో చిక్కుకున్న నీనును కాపాడేందుకు వెళ్లిన అనిల్ భార్యను రక్షించేందుకు వెళ్లి తాను మంటల్లో చిక్కుకున్నాడు. దీంతో నీను అరుపులు విన్న పక్క అపార్టుమెంటు వాసులు అక్కడి వచ్చి చూసేసరికి అనిల్ మంటల్లో చిక్కుకుని కనిపించారు. మంటలను ఆర్పి దంపతులిద్దరినీ అబుదాబిలోని మఫ్రాక్ ఆస్పత్రికి తరలించారు. కాగా వైద్యులు చికిత్స అందిస్తున్న తరుణంలో నీను పరిస్థితి నిలకడ ఉండగా. బాలుడి మెరుగైన వైద్యం కోసం అబుదాబిలోని మరో ఆసుపత్రికి గత మంగళవారం తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!