బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యూనిట్ వన్ ప్రారంభం
- February 17, 2020
అబుధాబి:ఫెడరల్ అథారిటీ ఫర్ న్యూక్లియర్ రెగ్యులేషన్ - ఎఫ్‌ఎఎన్‌ఆర్, బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యూనిట్ వన్‌కి సంబంధించి ఆపరేటింగ్ లైసెన్స్‌ని నవాహ్ ఎనర్జీ కంపెనీకి మంజూరు చేసినట్లు వెల్లడించింది. దీంతో, అరబ్ దేశాల్లో న్యూక్లియర్ ప్లాంట్ అమలు చేస్తున్న తొలి దేశంగా యూఏఈ అవతరించింది. అబుదాబీలో ఈ మేరకు ఓ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఎఫ్‌ఎఎన్‌ఆర్ ప్రతినిథులు మాట్లాడుతూ, అబుదాబీలోని అల్ దఫ్రాలో గల న్యూక్లియర్ ప్లాంట్ - యూనిట్ వన్ ఆపరేషన్స్‌కి సంబంధించి 60 ఏళ్ళ పరిమితితో లైసెన్స్ మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కార్పొరేషన్ తాలూకు సబ్సిడరీ సంస్థ నవాహ్. యూఏఈ న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్ కి సంబంధించి 12 ఏళ్ళ కల నేడు నెరవేరిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!