వాట్సాప్ ఇకపై ఫ్రీ ఫ్రీ ఫ్రీ
- January 21, 2016
యూఏఈలోని వాట్సాప్ వినియోగదారులు 'వాట్సాప్ ఇకపై ఉచితం' అనే మెసేజెస్‌ని అందుకుంటున్నారు. వివిధ దేశాల్లో వాట్సాప్ వినియోగదారుల నుంచి నామమాత్రంగా రుసుముని వసూలు చేస్తోంది. కొన్ని దేశాల్లో మాత్రం వాట్సాప్ సేవలు పూర్తిగా ఉచితం. ఇంకొన్ని దేశాల్లో తొలి ఏడాది ఉచితం, ఆ తర్వాత రుసులు వసూలు చేయాలనుకుంది. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఆన్‌లైన్ పేమెంట్ వంటి వాటి పట్ల అవగాహన లేని వాట్సాప్ వినియోగదారులు ఇబ్బంది కూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సాప్ వర్గాలు వెల్లడించాయి. 3.64 దిర్హామ్‌లు లేదా 99 సెంట్లు వాట్సాప్ వసూలు చేస్తోంది రుసుముకింద. వాట్సాప్‌ని ఫేస్‌బుక్ 19 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నా, వాట్సాప్ నుంచి 20 మిలియన్ డాలర్లు మాత్రమే సబ్‌స్క్రిప్షన్స్ రూపంలో పొందగలిగింది. వాట్సాప్‌లో మరిన్ని టూల్స్‌ని డెవలప్ చేస్తున్నామనీ, బ్యాంకింగ్ సహా పలు రంగాలు వినియోగించుకునేందుకు వీలుగా, వినియోగదారులకు మరింత చేరువయ్యేలా కొత్త ఆప్షన్స్ పొందు పర్చామనీ యాజమాన్యం చెబుతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







