2022 ప్యానెల్ రిక్రూటింగ్ మెంబర్స్
- January 21, 2016
ఖతార్ రెసిడెంట్స్ 2022 ఫిఫా వరల్డ్ కప్ కోసం 'యూత్ ప్యానెల్' విభాగంలో అవకాశాలు దక్కించుకోవడానికి వీలు కల్పిస్తున్నారు. గతంలో 35 మంది సభ్యులతో ఓ గ్రూప్‌ని నియమించారు. సుప్రీం కమిటీ ఫర్ డెలివరీ అండ్ లెగసీ (ఎస్సి) ఈ ఏర్పాట్లు చేసింది. కొత్తగా ఇంకో గ్రూప్‌ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 2022 ఫిఫా వరల్డ్ కప్‌కి సంబంధించి ఔత్సాహికులైన యువత ఈ అవకాశాన్ని పొందవచ్చు. గతంలో ఏర్పాటు చేసిన గ్రూప్ ప్రతి నెలా శనివారం వర్క్ షాప్స్, ఇతర యాక్టివిటీస్ కోసం సమావేశమవుతుంది. టౌన్ ప్లానింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మరియు పలు అంశాలకు సంబంధించి ఆ గ్రూప్‌లోని యువత మెలకువల్ని నేర్చుకుంటుంది. కొత్త ప్యానెల్లో రెండు గ్రూపులు ఉంటాయి. అరబిక్ మరియు ఇంగ్లీషులో వర్క్షాప్స్ని నిర్వహించడం వీటి బాధ్యత. 15 నుంచి 21 ఏళ్ళ మధ్య వయస్కులైన ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్లు పంపడానికి ఆఖరి తేదీ ఫిబ్రవరి 4.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







