బయో సదస్సుతో ప్రత్యేక గుర్తింపు:కేటీఆర్‌

- February 18, 2020 , by Maagulf
బయో సదస్సుతో ప్రత్యేక గుర్తింపు:కేటీఆర్‌

హైదరాబాద్‌: భారత్‌ నుంచి ఉత్పత్తయ్యే ఫార్మా ఉత్పత్తుల్లో హైదరాబాద్‌ నుంచే 35 శాతం తయారవుతున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సాంకేతికత, లైఫ్‌సైన్సెస్‌ రంగాల్లో తెలంగాణ రాణిస్తోందని చెప్పారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో జరిగిన బయో ఆసియా సదస్సుకు కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో ఫార్మాసిటీ అవసరాన్ని కేంద్రం గుర్తించిందని.. అందుకే అన్ని అనుమతులూ వచ్చాయన్నారు.
బయో ఆసియా సదస్సు అంతర్జాతీయంగా హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 276 ఎకరాల్లో వైద్య పరికరాల పార్కు ఏర్పాటైందని.. రెండేళ్ల వ్యవధిలో 20 సంస్థలు తమ ఉత్పత్తి ప్రారంభించాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ట్రిపుల్‌ ఐ (ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌) నినాదంతో ముందుకెళ్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com