‘దేవినేని’ సినిమా డబ్బింగ్ లో సురేష్ కొండేటి
- February 18, 2020
వంగవీటి మోహనరంగా గొంతు ఎలా ఉంటుందో మనకు తెలియదుగానీ సురేష్ కొండేటి రంగా పాత్రకు డబ్బంగ్ చెబుతుంటే అక్కడున్న వారంతా అదరహో అన్నారు. నిజంగా రంగా గొంతు ఇలాగే ఉంటుందేమో అనికూడా అన్నారు. తారకరత్న, సురేష్ కొండేటి హీరోలుగా తెరెకెక్కుతున్న ‘దేవినేని’ చిత్రం డబ్బింగ్ దశలో ఉంది. రంగా పాత్రను పోషిస్తున్న సురేష్ కొండేటి సోమవారం ప్రసాద్ ల్యాబ్ డబ్బింగ్ ధియేటర్‌లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పారు. శివనాగేశ్వర్రావు (శివనాగు) దర్శకత్వంలో ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రామూరాథోడ్, జి.ఎస్.ఆర్.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్, ఎడిటింగ్ కార్యక్రమాను పూర్తి చేసుకున్న ఈ చిత్రం వారం రోజుగా డబ్బింగ్ కార్యక్రమాల్లో ఉంది.
చిత్ర దర్శకుడు శివనాగు మాట్లాడుతూ.. ‘ఆనాటి మహాభారతం, రామాయణం కథల్లో ఏముందో మనందరికీ తెలుసు. విజయవాడలో దేవినేని నెహ్రూ, రంగాల మధ్య ఏం జరిగిందో కొంతే మనకు తెలుసు. వారిద్దరి మధ్యా ఎలాంటి సంఘర్షణ జరిగింది, అది ఘర్షణకు ఎలా దారితీసింది అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది’ అని వివరించారు. ఈ సినిమాకు సంబంధించి వరుసగా డబ్బింగ్ కార్యక్రమం జరుగుతున్నాయని వివరించారు. ఏప్రిల్ మొదటివారంలో సినిమా విడుదవుతుందని చెప్పారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ రంగా పాత్రకు డబ్బింగ్ చెప్పడం చాలా థ్రిల్ కలిగించిందని అన్నారు. కంటిన్యూగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. రంగాతో తనకు అంతగా పరిచయం లేకపోయినా ఆయన ఎలా మాట్లాడి ఉంటారో ఊహించుకుని మాట్లాడానన్నారు. తొలిరోజు డబ్బింగ్ కు మంచి అప్లాజ్ రావడం ఆనందం కలిగించిందని చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన రామూరాథోడ్ మాట్లాడుతూ.. మేము అనుకున్నదానికన్నా సినిమా బాగా వచ్చింది. ఎక్కడా రాజీపడకుండా చిత్రీకరించామన్నారు. మరో నిర్మాత జి.ఎస్.ఆర్.చౌదరి మాట్లాడుతూ.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాు చురుకుగా సాగుతున్నాయని చెప్పారు. ఇందులో హీరోయిన్లుగా నవీనారెడ్డి, తేజా రెడ్డి నటిస్తున్నారు. రాజ్ కిరణ్ ఈ చిత్రానికి చక్కని సంగీతం అందించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







