పోలీసు ఒంటికి యోగా మంచిదేగా..ఉపాసన యోగా పాఠాలు
- February 18, 2020
హైదరాబాద్:పక్షులు, జంతువుల మీద అత్యంత ప్రేమను కనబరిచే ఉపాసన కొణిదెల దృష్టి మనుషుల వైపు మళ్ళినట్లుంది. మనుషుల్లో ప్రేమ, ఆరోగ్య చైతన్యం కలిగించడమే ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది. ‘నిన్ను నువ్వు ప్రేమించుకో’మంటూ ఆమె తాజాగా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘ముందు నిన్ను నువ్వు ప్రేమించడం మొదలు పెడితే ఇతరులను ప్రేమించే దృష్టి అలవడుతుంది. అప్పుడే ఇతరులు కూడా నిన్ను ప్రేమిస్తారు. మానవ సంబంధాలు బలపడాలంటే నిన్ను నువ్వు ప్రేమించడమే తారక మంత్రం అంటూ నిన్నగాక మొన్న ట్వీట్ చేసిన ఆమె తాజాగా పోలీసులకు యోగా పాఠాలు బోధిస్తూ కనిపించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అందుకు యోగా కావాలంటూ ఆమె యోగా గురువు ఎడ్డీ స్టెర్న్‌తో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. యోగాలో ఎడ్డీకి మంచి చరిత్రే ఉంది. ఆయన న్యూయార్క్ వాసి. మైసూర్ స్కూల్ ఆఫ్ యోగాలో అష్టాంగమార్గాన్ని అభ్యసించారు. వేదాలను చక్కగా అధ్యయనం చేశారు.ఆయన ఉపాన్యాసాలు, రాసిన పుస్తకాలు అనేక భాషల్లోకి అనువాదమయ్యాయి. నిరంతరం విధుల్లో అలుపెరుగకుండా ఉండే పోలీసులకు యోగా అవసరమని భావించిన ఉపాసన అపోలో ఫౌండేషన్ తో కలిసి ఈ యోగా సదస్సు నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారి అంజని కుమార్ ఈ కార్యక్రమానికి తనవంతు సహకారాన్ని అందించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!