గత ఏడాది రెడ్ లైట్ సంకేతాన్ని23,214 మంది ఉల్లంఘన
- January 21, 2016
ఎర్రరంగు కాంతి సంకేతాన్ని దాటి ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనకు పాల్పడినవారు గత ఏడాదితో సరి పోల్చితే, 2015 లో ఆ సంఖ్య క్రమేపి తగ్గుముఖం పడుతుందని షార్జా పోలీసులు మంగళవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు, 2014లో ఈ ఉల్లంఘనలు 26,619 ఉండగా, 2015 లో అవి 23,214 గా నమోదయ్యాయి. ఎర్రరంగు కాంతి సంకేతాన్ని అతిక్రమించేవారు రెండు రకాలైన జరిమానాలు చెల్లించాలి అనే ట్రాఫిక్ నిబంధన అత్యధికులను కట్టడి చేసిందని చెప్పవచ్చు. ఇందులో మొదటిది ' సిగ్నెల్ జంపింగ్ ' కింద 800 దినార్లను చెల్లించాలి. ఆ అతిక్రమణకు గాను ఆయా వాహనాన్ని 15 రోజుల పాటు తమ ఆధీనంలోనే పోలీసులు ఉంచుకొంటారు. ఆ తర్వాత వాహనదారుడు అతి వేగంగా ఆ రోజు వాహనాన్ని నడిపినందుకు రెండవ దఫా జరిమానా వడ్డింపును గుర్తు చేసుకొని మరీ విధిస్తారు, దీంతో వేగంగా దూసుకుపోయే డ్రైవర్ బాబులు తప్పక తమ జోరు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2014 లో ఎక్కువగా నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనలలో అతి వేగంగా వాహనాన్ని నడపడం, ముఖ్య కూడళ్ళలో ఎరుపు రంగు దీపాలు తమ కాంతి మార్చుకొనే లోపున రెప్పపాటులోతమ వాహనాన్ని ట్రాఫిక్ రద్దీలో పరుగు పెట్టించిన వారే అధికులు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







