రియాద్:గుడువుకు ముందే ముఖీమ్ ఐడీ కార్డ్స్ రెన్యూవల్ చేసుకోవాలంటున్న అధికారులు

- February 18, 2020 , by Maagulf
రియాద్:గుడువుకు ముందే ముఖీమ్ ఐడీ కార్డ్స్ రెన్యూవల్ చేసుకోవాలంటున్న అధికారులు

సౌదీలోని ప్రవాసులు అందరు తమ ముకీమ్ ఐడెంటిటీ కార్డుల గడువు ముగియడానికి కనీసం మూడు రోజుల ముందే కార్డును రెన్యువల్ చేయించుకోవాలని డైరెక్టరేట్ జనరల్
ఆఫ్ పాస్ పోర్ట్స్ (జవజత్) ప్రకటించింది. డైరెక్టరేట్ యొక్క నిబంధనలు మరియు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని జావాజాత్ గుర్తు చేసింది. ముకీమ్ ఐడెంటీటి కార్డుల రెన్యూవల్ విషయంలో అలక్ష్యంగా వ్యవహరించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. జరిమానాతో పాటు దేశబహిష్కరణ విధించే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపింది. రెన్యూవల్ నిబంధనను ఉల్లంఘించిన ప్రవాసీయులకు తొలి తప్పుగా SR500 జరిమానా విధిస్తారు. రెండోసారి రిపీట్ అయితే.. SR1,000 ఫైన్ వేస్తారు. మూడో సారి మాత్రం దేశం నుంచి బహిరించనున్నట్లు స్పష్టం చేసింది. ముకీమ్ ఐడెంటీటి కార్డు హోల్డర్ తన రెసిడెన్స్ పర్మిట్ వాలిడిటీ పిరియడ్ ను కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సర్వీసెస్ అబ్షర్ లో లాగిన అవటం ద్వారాగాని..ముకీమ్ ఈ పోర్ట్ ద్వారా గానీ వివరాలను పొందవచ్చని జావజత్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com