మస్కట్:ప్రవాసీయులను పెళ్లి చేసుకున్న ఒమనీ మహిళల పిల్లలకు ట్యూషన్ ఫీజు మినహాయింపు
- February 18, 2020
మస్కట్:ప్రవాసీయులను వివాహం చేసుకున్న ఒమనీ మహిళల విన్నపాన్ని ఒమన్ మినిస్ట్రి ఎడ్యూకేషన్ మన్నించింది. ఇక నుంచి వారి పిల్లలకు ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఒమనీ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ సిఫార్సుల మేరకు విద్యా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఒమన్ మినిస్ట్రి విడుదల చేసిన డిక్రి నెంబర్ 34/2018 ప్రకారం ఒమనీయేతర విద్యార్ధులకు ట్యూషన్ ఫీజు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రవాసీయులను పెళ్లాడిన ఒమనీ మహిళలు తమ పిల్లలను డిగ్రీ నెంబర్ 34/2018 నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి విన్నపాలపై పర్యవేక్షించిన ఒమనీ కమిషన్ పలుమార్లు మినిస్ట్రి ఆఫ్ ఎడ్యూకేషన్ అధికారులతో చర్చించింది. ప్రాథమిక హక్కుల చట్టం, బాలల హక్కుల చట్టం మేరకు ఫీజు నుంచి మినహాయించాలని ఒమనీ కమిషన్ నివేదిక సమర్పించింది. కమిషన్ సిఫార్సులను పరిశీలించిన విద్యామంత్రిత్వ శాఖ ప్రవాసీయులను వివాహం చేసుకన్న ఒమన మహిళల పిల్లలకు ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..