దోహా:అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్ కు పెరిగిన విజిటర్స్ తాకిడి..రెండు రోజుల్లోనే 4000 మంది సందర్శన
- February 18, 2020
దోహాలో కొత్త హంగులతో రీ ఓపెన్ అయిన అల్ ఖోర్ ఫ్యామిలి పార్క్ విజిటర్స్ నుంచి అనూహ్య స్పందన వస్తోంది. పార్క్ ప్రారంభమైన రెండు రోజుల్లోనే దాదాపు 4000 మంది
విజిటర్స్ సందర్శించినట్లు మినిస్ట్రి ఆఫ్ మున్సిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ లోని పార్క్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. విజిటర్స్ సంఖ్య భారీగా ఉండటంతో పార్క్ సందర్శనలో ముందుగా విధించిన నిబంధనలను అధికారులు సవరించారు. ముందుగా నిర్ణయించిన రూల్స్ ప్రకారం మంగళవారాల్లో మహిళలు, పిల్లలను మాత్రమే అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అయితే..ఎక్కువ మంది విజిటర్స్ పార్క్ ను సందర్శించేందుకు వీలుగా ఈ నిబంధనను సవరిస్తూ..ఈ రోజు అలాగే వచ్చే మంగళవారం(25 ఫిబ్రవరి) ఫ్యామిలి మెంబర్స్ అందర్ని పార్క్ లోకి అనుమతించనున్నారు. తొలి రెండు రోజుల్లోనే 4000 మంది విజిటర్స్ వస్తే అందులో 838 మంది బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైన్ రైడ్ ను ఎంజాయ్ చేసినట్లు పార్క్ అధికారులు తెలిపారు.
దాదాపు 100 రోజుల తర్వాత అల్ ఖోర్ ఫ్యామిలి పార్క్ గత ఆదివారం నుంచి రీఓపెన్ అయిన విషయం తెలిసిందే. దాదాపు QR32m ఖర్చుతో మినిస్ట్రి ఆఫ్ మున్సిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అధికారులు పార్క్ ను రినోవేట్ చేశారు. పార్క్ లో మ్యూజియమ్, ఓపెన్ థియేటర్ తో పాటు పలు రకాల జంతువులు, పక్షలు విజిటర్స్ ను అలరిస్తున్నాయి. పార్క్ లో ఎంట్రీ ఫీజును పెద్దలకు QR15, పదేళ్లలోపు పిల్లలకు QR10లుగా నిర్ణయించారు. ఒక్క ఏడాదిలో 5 లక్షల మంది విజిటర్స్ వస్తారని మినిస్ట్రి అంచనా వేస్తోంది. అంచనాలకు తగినట్టే తొలి రెండు రోజుల్లోనే 4000 మంది పార్క్ ను విజిట్ చేశారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!