APNRTS ఆధ్వర్యంలో శిక్షణ మరియు నియామకాలు

- February 18, 2020 , by Maagulf
APNRTS ఆధ్వర్యంలో శిక్షణ మరియు నియామకాలు

అమరావతి:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఏపిఎన్‌ఆర్‌టి సొసైటీ తన “శిక్షణ మరియు నియామకాలు” కార్యక్రమంలో భాగంగా, ఫిబ్రవరి 18, 2020 న విజయవాడలోని కానూరులోని వి.ఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించింది. ఏపిఎన్‌ఆర్‌టిఎస్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఒక ప్రత్యేకమైన ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది మరియు సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్లేస్‌మెంట్లను సులభతరం చేసింది.  ఈ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో నాలుగు సంస్థలు నార్మ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ (Norm Software Solutions), హెడ్‌రన్ (Headrun), కాడెప్లోయ్ (CADeploy), ఇన్ఫ్లోక్యురిస్ (Inflocuris) పాల్గొన్నాయి.  సంస్థల హెచ్‌ఆర్ ప్రతినిధులు ప్రాథమిక ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు. షార్ట్ లిస్టైన  అభ్యర్థులకు ఆయా కార్యాలయాల్లో ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూలు  నిర్వహించబడతాయి.

వివిధ కళాశాలలకు చెందిన మొత్తం 780 మంది విద్యార్థులు ఈ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌కి హాజరయ్యారు.. ఏపిఎన్‌ఆర్‌టిఎస్ అందించే వివిధ సేవల గురించి ఏపిఎన్‌ఆర్‌టిఎస్ అధ్యక్షులు  వెంకట్ ఎస్ మేడపాటి సందేశాన్ని డిప్యూటి డైరెక్టర్ మహమ్మద్ కరీముల్లా షేక్ అభ్యర్థులకు వివరించారు. ఐటి  పరిశ్రమల్లో ప్రపంచస్థాయి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకోడానికి  అభ్యర్థులకు పలు కోర్సుల్లో ఆన్ లైన్  ఉచిత ఐటి & సాఫ్ట్‌వేర్ శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. నియామకాల కోసం వస్తున్న కంపెనీలు ప్రవాసాంధ్రులకు సంబంధించినవై ఉంటున్నాయని  తెలియజేశారు.  మరికొంతమంది ఆంధ్రులు రాష్ట్రానికి  తమ వంతు బాధ్యతగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి వారి కార్యకలాపాలకు సంబంధించిన ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశాయన్నారు. 
అంతేకాకుండా విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కెరీర్ కౌన్సెలింగ్ అందించడానికి ఏపిఎన్‌ఆర్‌టిఎస్ “విద్యా వాహిని” ద్వారా, విదేశాల్లో  విద్య అభ్యసించాలనునుకునే విద్యార్ధులకు విదేశీ విశ్వ విద్యాలయాల గురించి, అడ్మిషన్
ప్రక్రియ, స్కాలర్‌షిప్ ప్రోగ్రాం, కెరీర్ అవకాశాలు, వీసా ప్రాసెస్ తదితర విషయాలన్నింటి గురించి విద్యార్థులకు మార్గదర్శనం చేస్తోందని తెలిపారు.

వృత్తి ని నిర్మించుకోవడంలో మరియు జీవితంలో విజయం సాధించడంలో “నైపుణ్యాలు” ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని వెంకట్ పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి యువతలో  నైపుణ్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించారు. ఇందుకోసం రెండు నైపుణ్య విశ్వవిద్యాలయాలు విశాఖపట్నం మరియు తిరుపతిలో ఏర్పాటు చేయబడుతున్నాయి. ఇవి కాకుండా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక  నైపుణ్య కళాశాల అభివృద్ధి చేయబడుతుందని, రాబోయే రెండేళ్లలో ఈ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లోని పరిశ్రమ నిపుణుల మార్గదర్శకత్వంలో సంబంధిత నైపుణ్యాలపై యువతకు శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు.  ప్రభుత్వం చేపడుతున్న ఈ విద్యాలయాల ఏర్పాటు వలన.. అవసరమైన సాంకేతిక నైపుణ్యాలతో కూడిన ప్రతిభావంతులైన యువత తయారవుతుంది.. తద్వారా మల్టీ నేషనల్ సంస్థలను రాష్ట్రం వైపు ఆకర్షించడానికి ఇది దోహదం చేస్తుందన్నారు.

ఈ డ్రైవ్ లో వి.ఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రత్న ప్రసాద్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు మరియు వారి ఇంటర్వ్యూలలో అందరూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com