నోరు జారటంతో నెటిజన్ల చేతిలో ట్రోల్ అవుతున్న కిషన్ రెడ్డి
- February 19, 2020
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. అనుకోకుండా నెటిజన్ల చేతిలో బుక్కైపోయారు. తెలంగాణకు రైల్వే బడ్జెట్ కేటాయింపులపై టీఆర్ఎస్ నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టబోయి.. కాస్త పట్టు తప్పి మాట్లాడారు. హైదరాబాద్ లో చర్లపల్లి శాటిలైట్ రైల్వే స్టేషన్ కు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో.. ట్రోలింగ్ కు గురవుతున్నారు.
"ఎర్రబస్సు మాత్రమే తెలిసిన తెలంగాణకు.. మోడీ ప్రభుత్వం వచ్చాకే అనేక రైళ్లు వచ్చాయి" అని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ కామెంట్లపై తీవ్రంగా స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణకు తొలి రైలు తెచ్చిన మోడీకి కృతజ్ఞతలు అని కొందరు వెటకారం చేస్తుంటే.. రాష్ట్ర ప్రజలను అవమానించారంటూ.. మరి కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరి కొందరైతే.. నిజాం కాలంలోనే హైదరాబాద్ లో రైల్వే సర్వీసులు ఉన్నాయని.. ముక్కోటి ఏకాదశి లాంటి పర్వదినాలకు అప్పట్లో నిజాం ప్రభువు టికెట్ ధరల్లో రాయితీ కూడా ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. నాటి గోల్కొండ దిన పత్రిక క్లిప్పింగ్ ను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తించాలని కోరుతున్నారు.
గతంతో పోలిక పెట్టే క్రమంలో ఎర్రబస్సుగాళ్లు అని అర్థం వచ్చేలా కిషన్ రెడ్డి పొరబాటున చేసిన వ్యాఖ్యలు ఇంత దూరం వస్తాయని.. బీజేపీ నేతలు కూడా ఊహించి ఉండకపోవచ్చు.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!