దుబాయ్: డ్రగ్ స్మగ్లింగ్ కేసులో పాకిస్తానీకి పదేళ్ల జైలు శిక్ష
- February 19, 2020
గ్రీన్ టీ బ్యాగ్స్ లో కిలోకు పైగా హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన పాకిస్తానీకి దుబాయ్ క్రిమినల్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే AED 50,000 ఫైన్ విధించింది. శిక్షా
కాలం పూర్తైన తర్వాత దేశం విడిచి వెళ్లాల్సిందిగా పాకిస్తానీ స్మగ్లర్ ను దుబాయ్ క్రిమినల్ కోర్టు ఆదేశించింది. కోర్టు రికార్డ్స్ ప్రకారం గత ఏడాది నవంబర్ 7న నిందితుడ్ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను గ్రీన్ టీ రాపర్స్ లో 1.1 కిలోల హెరాయిన్ నింపి.. టీ బాక్సెస్ నమ్మించబోయాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో తెల్లవారుజామున ఫ్లైట్ దిగిన నిందితుడి దగ్గర టీ బాక్సుల లగేజీ ఎక్కువగా ఉండటం ఎయిర్ పోర్టు కస్టమ్స్ అఫీసర్స్ కి అనుమానం కలిగింది. అసాధారణ స్థాయిలో టీ బ్యాక్స్ ఎందుకు తీసుకెళ్తున్నాడనే సందేహంతో అతని లగేజ్ ను కస్టమ్స్ అఫీసర్స్ చెక్ చేశారు. టీ బ్యాగ్స్ రాపర్స్ లో అనుమానిత పౌడర్ ను గుర్తించిన అధికారులు వెంటనే అతన్ని పోలీసులు, యాంటీ డ్రగ్స్ ఫోర్స్ కి అప్పగించారు. ఫోరెన్సిక్ టెస్ట్ తర్వాత హెరాయిన్ అని నిర్ధారణ కావటంతో పాకిస్తానీ స్మగ్లర్ ను అరెస్ట్ చేశారు. క్రిమినల్ కోర్టులో నేరం రుజువు కావటంతో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే..రెండు వారాల్లో అతను అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!