'వాహ్' అనిపిస్తున్న జోడీ
- February 19, 2020
లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం 83. ఇందులో రణ్వీర్ కపిల్ దేవ్ పాత్రలో నటిస్తుండగా.. ఆయన భార్య రోమి భాటియాగా దీపిక పదుకోన్ నటించారు. తాజాగా రోమి పాత్రలో దీపికాకి సంబంధించిన లుక్ విడుదల చేశారు మేకర్స్. రణ్వీర్తో కలిసి ఉన్న దీపికా లుక్ ఆకట్టుకుంటుంది.ఇప్పటికే దీపికా, రణ్‌వీర్‌లు రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్ చిత్రాలలో కలిసి నటించారు. రియల్ లైఫ్‌లో భార్య భర్తలు అయిన వీరిద్దరు పెళ్లి తర్వాత కలిసి నటించిన తొలి చిత్రం 83 కావడం విశేషం. 83 చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా, దీపిక పదుకోన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
83 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా.. ఇండియన్ క్రికెట్ టీమ్ తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో రోమితో పాటు పలువురు అర్ధాంతరంగా స్టేడియం నుంచి బయటకు వెళ్తారు. అయితే అనూహ్యంగా దిగ్గజ జట్టు వెస్టిండీస్‌పై భారత్ పైచేయి సాధించడంతో తిరిగి మ్యాచ్ చూడటానికి వస్తే.. సెక్యూరిటీ అనుమతించకపోవడమనే సీన్ సినిమాకు ఓ హైలెట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. ఆ సమయంలో రోమి పడే ఆవేదన డ్రమాటిక్‌గా ఉంటుందట. ఈ చిత్రంలో సాకీబ్ సలీం, హర్డీ సందూ, అమ్మీ విర్క్, తాహీర్ బాసిన్, చిరాగ్ పాటిల్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10, 2020 రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!