మరిన్ని ఉద్యోగాల్లో వలసదారుల్ని రీప్లేస్‌ చేయనున్న ఒమానీయులు

మరిన్ని ఉద్యోగాల్లో వలసదారుల్ని రీప్లేస్‌ చేయనున్న ఒమానీయులు

మస్కట్‌: ఒమనైజేషన్‌లో భాగంగా ప్రైవేట్‌ హెల్త్‌ సెక్టార్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో టెక్నికల్‌ పొజిషన్స్‌ కోసం వలసదారుల స్థానంలో ఒమానీయులు ఎక్కువ అకవాశాలు కల్పించాలనే అంశంపై మజ్లిస్‌ అల్‌ షురాలో చర్చ జరిగింది. షురా కౌన్సిల్‌ స్పీకర్‌ ఖాలిద్‌ బిన్‌ హిలాల్‌ అల్‌ మావలి నేతృత్వంలో ఈ మీటింగ్‌ జరిగింది. షురా మెంబర్స్‌ కౌన్సిల్‌ సెక్రెటరీ జనరల్‌ షేక్‌ అహ్మద్‌ బిన్‌ ముహమ్మద్‌ అలీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లేబరేటరీ టెక్నీషియన్లు, మెడికల్‌ ప్రొఫెషన్‌ ఆగ్జిలరీ, ఫిసియోథెరపిస్ట్‌ టెక్నీషియన్‌, నర్సింగ్‌ ప్రొఫెషన్‌, ఫార్మసీ ప్రొఫెషన్‌, ఫార్మసిస్ట్‌ అసిస్టెంట్‌ / ఫార్మసిస్ట్‌, ఎక్స్‌రే టెక్నీషియన్‌, సూపర్‌ వైజర్‌ / హెల్త్‌ అబ్జర్వర్‌ తదితర విభాగాల్లో ఒమానీయులు ప్రాధాన్యత ఇవ్వాలని షురా కౌన్సిల్‌ తీర్మానించింది.

 

Back to Top