'కిలికి' వెబ్‌సైట్ లాంఛ్ చేయనున్న రాజమౌళి
- February 19, 2020
బాహుబలి కోసం రాజమౌళి మాహిష్మతి రాజ్యాన్ని సృష్టించారు. తమిళ రచయిత మదన్ కర్కి అయితే ఆ బాహుబలి కోసం 'కిలికి' భాషను సృష్టించారు. బాహుబలిలో కాలకేయలు కిలికి భాషలో మాట్లాడారు కదా! ఇప్పుడు ఆ భాష మీద ఒక వెబ్‌సైట్ వస్తోంది. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే సందర్భంగా ఫిబ్రవరి 21న దర్శక ధీరుడు రాజమౌళి లాంఛ్ చేయనున్నాడు. ఈ వెబ్‌సైట్ ను మదన్ కర్కి రీసెర్చ్ ఫౌండేషన్ డెవలప్ చేసింది. కిలికి లాంగ్వేజ్, వెబ్‌సైట్ గురించి మదన్ కర్కి మాట్లాడుతూ "ఆస్ట్రేలియాలో 'క్లిగ్' నుండి నేను కిలికి లాంగ్వేజ్ క్రియేట్ చేశా. ఏదో ఒక రాజ్యంలోనో, ప్రాంతంలోనో కాలకేయులు ఉంటారని రాజమౌళిగారు చూపించాలని అనుకోలేదు. వాళ్లను ప్రత్యేకంగా చూపించాలని అనుకున్నారు. డిఫరెంట్ లాంగ్వేజ్ కావాలనుకున్నారు. అప్పుడు కిలికి క్రియేట్ చేశా. ఈ లాంగ్వేజ్ మీద వెబ్ సైట్ లాంఛ్ చేయడానికి రాజమౌళి కంటే బెస్ట్ పర్సన్ ఎవరు ఉంటారు?
నేను హైదరాబాద్ వచ్చి, ఆయనను అడగగానే ఒప్పుకున్నారు. ఆయన పేరును కిలికి భాషలో చూసుకున్నారు. కిలికి అక్షరాలు, సంఖ్యల మీద ఆసక్తి కనబరిచారు. ఆన్‌లైన్‌లో రాజమౌళి గారు ఈ వెబ్ లాంఛ్ చేస్తారు" అన్నారు. కొత్త భాషను నేర్చుకోవాలని అనుకునేవారు శుక్రవారం కిలికి వెబ్ చుడండి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!