'కిలికి' వెబ్సైట్ లాంఛ్ చేయనున్న రాజమౌళి
- February 19, 2020బాహుబలి కోసం రాజమౌళి మాహిష్మతి రాజ్యాన్ని సృష్టించారు. తమిళ రచయిత మదన్ కర్కి అయితే ఆ బాహుబలి కోసం 'కిలికి' భాషను సృష్టించారు. బాహుబలిలో కాలకేయలు కిలికి భాషలో మాట్లాడారు కదా! ఇప్పుడు ఆ భాష మీద ఒక వెబ్సైట్ వస్తోంది. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే సందర్భంగా ఫిబ్రవరి 21న దర్శక ధీరుడు రాజమౌళి లాంఛ్ చేయనున్నాడు. ఈ వెబ్సైట్ ను మదన్ కర్కి రీసెర్చ్ ఫౌండేషన్ డెవలప్ చేసింది. కిలికి లాంగ్వేజ్, వెబ్సైట్ గురించి మదన్ కర్కి మాట్లాడుతూ "ఆస్ట్రేలియాలో 'క్లిగ్' నుండి నేను కిలికి లాంగ్వేజ్ క్రియేట్ చేశా. ఏదో ఒక రాజ్యంలోనో, ప్రాంతంలోనో కాలకేయులు ఉంటారని రాజమౌళిగారు చూపించాలని అనుకోలేదు. వాళ్లను ప్రత్యేకంగా చూపించాలని అనుకున్నారు. డిఫరెంట్ లాంగ్వేజ్ కావాలనుకున్నారు. అప్పుడు కిలికి క్రియేట్ చేశా. ఈ లాంగ్వేజ్ మీద వెబ్ సైట్ లాంఛ్ చేయడానికి రాజమౌళి కంటే బెస్ట్ పర్సన్ ఎవరు ఉంటారు?
నేను హైదరాబాద్ వచ్చి, ఆయనను అడగగానే ఒప్పుకున్నారు. ఆయన పేరును కిలికి భాషలో చూసుకున్నారు. కిలికి అక్షరాలు, సంఖ్యల మీద ఆసక్తి కనబరిచారు. ఆన్లైన్లో రాజమౌళి గారు ఈ వెబ్ లాంఛ్ చేస్తారు" అన్నారు. కొత్త భాషను నేర్చుకోవాలని అనుకునేవారు శుక్రవారం కిలికి వెబ్ చుడండి.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!