ట్రంప్ విమానం 'ఎయిర్‌ఫోర్స్ వన్' విశేషాలు
- February 19, 2020
ఎయిర్‌ఫోర్స్ వన్ విశేషాలెన్నో
అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా భారత్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ నెల 24న తన సతీమణి మెలానియాతో కలిసి బోయింగ్ 747-200బీ సిరీస్ విమానంలో దిల్లీకి రానున్నారు. 'ఎయిర్‌ఫోర్స్ వన్'గా పిలిచే ఈ విమానం ట్రంప్ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అమెరికా అధ్యక్షుడిని తీసుకెళ్లే ఈ విమానంలో ఎన్నో విశేషాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 'ఎగిరే శ్వేతసౌధమ'నే అనాలి. ప్రతి విషయంలోనూ ప్రత్యేకత చాటుకునే అమెరికా.. దేశాధ్యక్షుడి విమానాన్ని కూడా అత్యంత అధునాతనంగా, వైభవంగా తీర్చిదిద్దింది. విమానంపై 'United States of America' అక్షరాలు, అమెరికా జాతీయ జెండా, అధ్యక్షుడి ముద్రతో ఉండే ఎయిర్‌ఫోర్స్ వన్ తనదైన ప్రత్యేకత చాటుతోంది.
ప్రత్యేకతలివే..
ఇతర బోయింగ్ ప్యాసింజర్ విమానాల మాదిరిగా కాకుండా ఎయిర్‌ఫోర్స్ వన్‌కు గాల్లోనే ఇంధనం నింపుకొనే సామర్థ్యం ఉంది. అధ్యక్షుడు ఎక్కడికెళ్లాలంటే అక్కడకు తీసుకెళ్లే అపరిమిత రేంజ్ దీని సొంతం. అధునాతన సెక్యూర్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ దీని మరో ప్రత్యేకత. అంటే ఒకవేళ అమెరికాపై దాడులు జరిగితే ఆ సమయంలో ఈ విమానం మొబైల్ కమాండ్ సెంటర్‌గా పనిచేస్తుంది.
100మందికి వంట చేయొచ్చు..
విమానం లోపల 4000 చదరపు అడుగుల ఫ్లోర్ స్పేస్ ఉంటుంది. దీన్ని మూడు లెవల్స్‌గా విభజించారు. ఇందులో ఒకటి ఎక్స్టెన్సివ్ సూట్. ఇందులో అధ్యక్షుడి కోసం పెద్ద ఆఫీస్, కాన్ఫరెన్స్ గది, టాయిలెట్ ఉంటాయి. ఇక రెండోది మెడికల్ సూట్. ఇందులో ఓ డాక్టర్ శాశ్వతంగా ఉంటారు. అధునాతన సర్జరీ గది కూడా ఉంటుంది. ఇక మూడోదాన్ని వంట కోసం కేటాయించారు. విమానంలోని రెండు వంటశాలల్లో 100 మందికి సరిపడా వంట ఒకేసారి చేయొచ్చని బోయింగ్ తెలిపింది. అధ్యక్షుడు, ప్రథమ మహిళ విశ్రాంతి కోసం ప్రత్యేకమైన క్వార్టర్లు ఉంటాయి. దీంతో పాటు అధ్యక్షుడితో కలిసి ప్రయాణించే సీనియర్ అడ్వైజర్లు, సీక్రెట్ సర్వీస్ అధికారులు, ప్రెస్, ఇతర అతిథుల కో
తాజా వార్తలు
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు