జర్మనీలో కాల్పులు...ఎనిమిది మంది మృతి
- February 20, 2020
జర్మనీ లోని ఫ్రాంక్ ఫర్ట్ సిటీ దగ్గర (భారత కాలమానం ప్రకారం) నిన్న రాత్రి జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఒక వ్యక్తి అక్కడ ఉన్న వారిపై విచ్చలవిడిగా కాల్పులు జరిపి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని కాల్పులు జరిపిన వ్యక్తి కోసం జల్లెడపడుతున్నారు.
కాల్పులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. అతడు ఎందుకు కాల్చాడు అనే విషయం కూడా ఇప్పటి వరకూ వెల్లడి కాలేదు. హనయు లోని బార్ వద్ద ఈ ఘటన జరిగింది. సంఘటనా స్థలం వద్దకు వచ్చిన సహాయ బృందాలు అక్కడి ప్రజలకు సహాయ చర్యలు ప్రారంభించాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







