హ్యాపీనెస్ క్లాసులో పాల్గొనున్న మెలానియా ట్రంప్
- February 20, 2020
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్‌తో పాటు భారత్‌కు వచ్చే అతని భార్య మెలానియా ట్రంప్ ఢిల్లీలో జరిగే హ్యాపీనెస్ క్లాసులో పాల్గొననున్నారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఫిబ్రవరి 25న ఢిల్లీలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగే హ్యాపీనెస్ క్లాసులో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఆమె 45 నిముషాల పాటు చిన్నారులతో గడపనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన ఈ నెల 24న ప్రారంభం కానుంది. కాగా 2018లో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో హ్యాపీనెస్ క్లాసులను ప్రారంభించారు. చిన్నారుల మానసిక వికాసానికి దోహదపడేలా ఈ తరగతులకు రూపకల్పన చేశారు. నర్సరీ నుంచి 8వ తరగతి వరకూ హ్యాపీనెన్ క్లాసులను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!