'విజయనిర్మల విగ్రహావిష్కరణ' సభలో భావోద్వేగానికి గురైన మహేశ్ బాబు
- February 20, 2020
ప్రముఖ నటి, దర్శకురాలు దివంగత విజయనిర్మల 74 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ శివారులోని నానక్ రామ్ గూడాలోని కృష్ణ, విజయ నిర్మల నివాసంలో.. విజయనిర్మల విగ్రహాన్ని ఆవిష్కరించారు. విజయనిర్మల స్త్రీ శక్తి అవార్డును దర్శకురాలు నందినిరెడ్డికి కృష్ణంరాజు, మహేశ్ బాబు చేతుల మీదుగా ప్రధానం చేశారు. అనంతరం మహేశ్ బాబు మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 'విజయ నిర్మల గారు చాలా గొప్ప వ్యక్తి. నా సినిమాలు రిలీజ్ అయిన సమయంలో మార్నింగ్ షో చూసి నాన్నగారు ఫోన్ చేసి మాట్లాడేవారు. తర్వాత ఆవిడ మాట్లాడేది.. శుభాకాంక్షలు తెలిపేది. సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలయ్యాక నాన్న గారు ఫోన్ చేశారు. ఆ తర్వాత ఆవిడ మాట్లాడుతుందని నేను అనుకున్నాను.. అయితే, ఆమె చనిపోయిందన్న విషయం తర్వాత గుర్తుకొచ్చింది' అంటూ మహేశ్ బాబు బాధపడ్డారు. ఆమె లేని లోటు తనకు గుర్తుకొచ్చిందని చెప్పారు. ఆమె ఏ లోకంలో ఉన్నా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!