వరల్డ్ లోనే ఫస్ట్ స్మార్ట్ మెడికల్ సెంటర్..30 నిమిషాల్లోనే యూఏఈ రెసిడెన్సీ వీసా
- February 21, 2020
దుబాయ్:సాధారణంగా మెడికల్ టెస్టు రిపోర్ట్స్ రెడీ అవటానికే గంటల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో 24 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. శాంపిల్స్ తీసుకొని వాటిని రిజిస్టర్ లో ఎంటర్ చేసేందుకే ఈజీగా అరగంట సమయం తీసుకునే ల్యాబ్ సెంటర్లు కోకొల్లలు. అలాంటిది 30 నిమిషాల్లోనే మెడికల్ టెస్టులు అన్ని పూర్తి చేసి, యూఏఈ రెసెడిన్సీ వీసా ఇవ్వటం సాధ్యమేనా? మిగతా ప్రాంతాల్లో అసాధ్యమేమోగానీ, దుబాయ్ లో మాత్రం కేవలం 30 నిమిషాల్లోనే మెడికల్ టెస్టులు పూర్తి చేసి రెసిడెన్సీ వీసా కూడా ఇచ్చేలా స్మార్ట్ మెడికల్ సెంటర్ ప్రారంభమైంది. 'సాలేమ్ ఇంటలిజెంట్ సెంటర్' పేరుతో ఏర్పాటు చేసిన స్మార్ట్ మెడికల్ సెంటర్ ను దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తౌమ్ ప్రారంభించారు. దీంతో మెడికల్ ఎగ్జామినేషన్ దగ్గర్నుంచి రెసిడెన్సీ వీసా మంజూరి వరకు పట్టే సమయం గణనీయంగా తగ్గనుంది.
ప్రపంచంలోనే ఇలాంటి సెంటర్ ఏర్పాటు కావటం ఇదే మొదటిదని యువరాజు ట్వీట్ ద్వారా తెలిపారు. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే రెసిడెంట్స్ వివరాల నమోదు, రెసిడెన్సీ వీసా మంజూరు అవుతుందని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ తో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన సాలేమ్ ఇంటలిజెంట్ సెంటర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టెక్నాలజీస్ తార్కాణంగా నిలుస్తుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







