దుబాయ్:24వ ఫ్లోర్ నుంచి దూకి ఇండియన్ ఆత్మహత్య..

- February 21, 2020 , by Maagulf
దుబాయ్:24వ ఫ్లోర్ నుంచి దూకి ఇండియన్ ఆత్మహత్య..

దుబాయ్ లో ఇంజనీర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇండియన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేరళాకు చెందిన 25 ఏళ్ల సబీల్ రెహ్మాన్ తాను పని చేస్తున్న దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ బిల్డింగ్ లోని 24వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ కి పాల్పడినట్లు దుబాయ్ పోలీసులు చెబుతున్నారు. బిల్డింగ్ వాచ్ మెన్ వెంటనే ఘటనపై పోలీసులకు సమాచారం అందించాడు. కమాండ్ కంట్రోల్ రూంకి ఎమర్జెన్సీ కాల్ ద్వారా సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీస్ పాట్రోలింగ్ టీం, ఫోరెన్సిక్ టీంను పంపినట్లు రషిదియా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ సయిద్ హమద్ బిన్ సులేమాన్ అల్ మలిక్ తెలిపారు. మృతుడు స్వస్థలం కేరళాలోని మలప్పురం జిల్లా తిరూర్ గా గుర్తించారు. సబీల్ రెహ్మాన్ మృతి వార్తతో అంతని సొంతూరు విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికి అందొచ్చిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడటంతో అతని కుటుంబం షాక్ నుంచి తేరుకోలేకపోతోంది.

మెడికల్, లీగల్ ప్రొసిజర్ పూర్తి చేసిన తర్వాత సబీల్ రెహ్మాన్ మృతదేహాన్ని సొంతూరికి తరలించారు. గురువారం ఉదయం 2.45 గంటలకు ఫ్లైట్ లో కేరళా చేరుకున్నట్లు సామాజిక కార్యకర్త నాసిర్ వతనాపల్లి తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30  గంటలకు అతని స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇదిలాఉంటే..సబీల్ రెహ్మాన్ ఆత్మహత్య చేసుకున్న తీరు అక్కడి సీసీ టీవీలో రికార్డ్ అయినట్లు పోలీసులు తెలిపారు. వాచ్ మెన్ దగ్గర కీస్ తీసుకొని 24వ ఫ్లోర్ కు వెళ్లి షూస్ విప్పేసి, బాల్కనిలోనే మొబైల్ పక్కన పెట్టి అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సీసీ కెమెరా ఫూటేజ్ ద్వారా తెలుస్తోంది. ఈ మొత్తం దుర్ఘటన 12 నిమిషాల్లో జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com