మనామ: చైనాకు బాసటగా నిలబడతామన్న బహ్రెయిన్ యువరాజు
- February 21, 2020
మనామ:కోవిడ్-19 వైరస్ తో సతమతం అవుతున్న చైనాకు బహ్రెయిన్ యువరాజు సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ మేరకు చైనా ప్రెసిడెంట్ జింగ్ పింగ్
కు సందేశం పంపించారు. కోవిడ్-19ను ఎదుర్కొవటంలో చైనా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇప్పటి వరకు వైరస్ బారిన పడి చైనాలో 2000 మందికిపైగా చనిపోగా...70 వేల మందికిపైగా ప్రజలకు వైరస్ సోకింది. వ్యాధితో చికిత్స పొందుతున్న వారందరూ త్వరగా కోలువకోవాలని ఆశిస్తున్నట్లు యువరాజు తెలిపారు. తమకు స్నేహశీలిగా ఉండే చైనా విపత్తు నుంచి తిరిగి త్వరగా పురోగతి సాధించాలని అభిలాషించారు. వైరస్ పై పోరాడటంతో చైనా ప్రజలు విజయం సాధించాలని, వైరస్ కు విరుగుడు కనుక్కోవటంలో చైనా చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితం దక్కాలని ఆకాంక్షించటంతో పాటు మెడికల్ డ్రగ్ కనుగొనటంలో చైనాకు తాము కూడా సపోర్ట్ ఇస్తామని యువరాజు అన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!