ఆడబిడ్డకు తల్లైన శిల్పాశెట్టి

- February 22, 2020 , by Maagulf
ఆడబిడ్డకు తల్లైన శిల్పాశెట్టి

ముంబై: బాలీవుడ్‌ భామ శిల్పాశెట్టి తన అభిమానులకు శుభవార్త చెప్పారు. తమకు పండంటి ఆడబిడ్డ జన్మించినట్లు తెలిపారు. ‘‘ఇన్నాళ్ల మా ప్రార్థనలకు ప్రతిగా ఓ అద్భుతం జరిగింది. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. జూనియర్‌ ఎస్‌ఎస్‌కే వచ్చేసింది. చిట్టితల్లి మా జీవితాల్లోకి రావడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. సమీశా శెట్టి కుంద్రా.. ఫిబ్రవరి 15న జన్మించింది. స అంటే సంస్కృతంలో కలిగి ఉండటం అని అర్థం. మిశ అంటే రష్యన్‌ భాషలో దేవత. మా ఇంటి లక్ష్మి.. మా కుటుంబాన్ని పరిపూర్ణం చేసింది. మా ఏంజెల్‌కు మీ ఆశీర్వాదాలు కావాలి. తల్లిదండ్రులు: రాజ్- శిల్పాశెట్టి కుంద్రా. అన్నయ్య వియాన్‌‌’’అని శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com