దుబాయ్‌లో 4,692 ఇన్స్టంట్ లైసెన్సుల జారీ
- February 22, 2020
దుబాయ్ ఎకానమీ - బిజినెస్ రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సింగ్ సర్వీసెస్ సెక్టార్, 4,692 ఇన్స్టంట్ లైసెన్సుల్ని జారీ చేసినట్లు వెల్లడించింది. మొత్తం లైసెన్సుల్లో 3,448 కమర్షియల్ లైసెన్సులు కాగా, 1,244 ప్రొఫెషనల్ లైసెన్సులు. కాగా, ఇన్స్టంట్ లైసెన్సుల ఓనర్స్ సంఖ్య 16,935కి చేరుకుంది. దీంట్లో పురుషుల సంఖ్య 14,842 కాగా, మహిళల సంఖ్య 2,093. బ్రిటన్, టర్కీ, సౌదీ అరేబియా, ఇండియా, చైనా, పాకిస్తాన్, ఈజిప్ట్, జోర్డాన్ మరియు సుడాన్‌కి చెందిన బిజినెస్మెన్ ఇందులో వున్నారు. లిమిటెడ్ లియాబిలిటీ, కంపెనీ (ఎల్ఎల్సి), సింగిల్ మెంబర్ ఎల్ఎల్సి, సోల్ ప్రొప్రైటర్‌షిప్ మరియు సివిల్ కంపెనీ విభాగాల్లో లైసెన్సులు పొందవచ్చు. ఇన్స్టంట్ లైసెన్స్ సర్వీస్ బిజినెస్‌మెన్‌కి ఎంతో కన్వీనియెంట్గా వుంటుందనీ, వారు కేవలం ఐదు నిమిషాల్లోనే కమర్షియల్ లైసెన్స్ పొంది, దుబాయ్‌లో సులువుగా బిజినెస్ ఏర్పాటు చేసుకోవచ్చనీ అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







