స్మార్ట్‌ ఫోన్‌ బైసికిల్‌ రెంటల్‌ సర్వీస్‌ని ప్రారంభించిన కరీమ్

- February 22, 2020 , by Maagulf
స్మార్ట్‌ ఫోన్‌ బైసికిల్‌ రెంటల్‌ సర్వీస్‌ని ప్రారంభించిన కరీమ్

రైడ్‌ హెయిలింగ్‌ ఫర్మ్‌ కరీమ్ అలాగే దుబాయ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ, 800 రెంటల్‌ బైసికిల్స్‌ని సిటీ వ్యాప్తంగా 78 లొకేషన్లలో అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 3,500 బైసికిల్స్‌ని 350 స్టేషన్స్‌లో ఏర్పాటు చేయాలన్నది ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం. పబ్లిక్‌కి ఈ బైక్స్‌ ఉదయం 10 గంటల నుంచి శనివారం అందుబాటులో వుంటాయి. మెరీనా బీచ్‌, జుమైరా బీచ్‌ రోడ్‌, జుమైరా లేక్‌ టవర్స్‌, ది గ్రీన్స్‌, బర్షా హైట్స్‌, దుబాయ్‌ వాటర్‌ కెనాల్‌, దుబాయ్‌ మీడియా సిటీ, డౌన్‌ టౌన్‌ దుబాయ్‌ మరియు అల్‌ కుద్రా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. పొల్యూషన్‌ని తగ్గించే క్రమంలో వీటిని తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ బైక్స్‌ని వినియోగించేవారు ఎమిరేట్‌ చట్టాలకి లోబడి వ్యవహరించాల్సి వుంటుంది. ఈ వాహనాలపై అత్యధిక వేగం కేవలం గంటకు 30 కిలోమీటర్లు మాత్రమే. పెద్దవారు వుంటేనే 15 ఏళ్ళలోపు పిల్లలకు బైక్‌లు ఇస్తారు. బైసికిల్స్‌ని జీపీఎస్‌ ద్వారా అనుసంధానించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com