షార్జాకి చెందిన కేరళ వాచ్‌మెన్‌ అద్భుత ప్రతిభ

- February 22, 2020 , by Maagulf
షార్జాకి చెందిన కేరళ వాచ్‌మెన్‌ అద్భుత ప్రతిభ

షార్జా: విజేష్‌ వివి, ఇండియాకి చెందిన వాచ్‌మెన్‌.. యూఏఈలో గత కొంత కాలంగా జీవిస్తున్నాడు. ఆయన వద్ద రెండు బ్రష్‌లు వుంటాయి. ఒకటి బిల్డింగ్స్‌ని క్లీన్‌ చేసేది అయితే, ఇంకోటి అద్భుతమైన పెయింట్స్‌ వేసేది. యూఏఈకి వచ్చాక, తాను పెయింటింగ్స్‌ వేయలేననే విషయం అర్థం చేసుకున్నాననీ, పని ఒత్తిడితో అది సాధ్యం కాకపోవచ్చనే నిర్ణయానికి వచ్చాననీ, అయితే క్రమక్రమంగా తనకు పెయింటింగ్‌ కోసం తగిన సమయం లభించేదని చెప్పారు విజేష్‌. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న తాను ఉదయం, సాయంత్రం సాధారణ క్లీనింగ్‌ తర్వాత దొరికే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానని అన్నారు. మొత్తం 9,000 డాట్స్‌తో యూఏఈ ప్రైవ్‌ు మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌవ్‌ు పెయింటింగ్‌ని వేశారు విజేష్‌. దీనికోసం కేవలం 6 గంటల సమయమే పట్టిందాయనకి. విజేష్‌ ఆర్టిస్టిక్‌ టాలెంట్‌ చూసి అంతా విస్తుపోతున్నారు. సొంతంగా వుడెన్‌ ప్రపోర్షన్‌ డివైడర్‌ని వినియోగించి, ప్రత్యేకంగా తనకు మాత్రమే సాధ్యమయ్యే ఆర్ట్‌ ఫావ్‌ుని కొనసాగిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com