దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఛాంపియన్ షిప్ టైటిల్ దక్కించుకున్న సిమోనా హాలెప్

దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఛాంపియన్ షిప్ టైటిల్ దక్కించుకున్న సిమోనా హాలెప్

దుబాయ్:రోమానియన్ టెన్నిస్ స్టార్ సిమోనా హాలెప్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఛాంపియన్ షిప్ టైటిల్ దక్కించుకుంది. ఉత్కంఠగా జరిగిన ఫైనల్ ఫైట్ సిమోనా హాలెప్ 3-6, 6-3, 7-6తో కజకిస్తాన్ ప్లేయర్ ఎలెనా రిబాకినాపై విజయం సాధించింది. ఈ టోర్నీ ప్రారంభం నుంచి భీకర ఫామ్ లో ఉన్న ఎలెనా రిబాకినా ఫస్ట్ సెట్ లో టాప్ సీడ్ సిమోనా హాలెప్ షాకిచ్చింది. పవర్ ఫుల్ సర్వీసులతో చెలరేగిపోయింది. దీంతో ఫస్ట్ సెట్ ను హాలెప్ 3-6తో కొల్పోయింది. అయితే ఆ వెంటనే తేరుకున్న టాప్ సీడ్ ప్లేయర్ మిగిలిన రెండు సెట్లను 6-3, 7-6తో దక్కించుకొని టైటిల్ విన్నిర్ గా నిలిచింది. హాలెప్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఛాంపియన్ షిప్ దక్కించుకోవటం ఇది రెండో సారి. 2015లోనూ ఆమె టైటిల్ విన్నర్ గా నిలిచింది.

Back to Top