మస్కట్:వెజిటెబుల్ మార్కెట్స్ లో స్ట్రీట్ వెంటర్స్ కి చెక్

మస్కట్:వెజిటెబుల్ మార్కెట్స్ లో స్ట్రీట్ వెంటర్స్ కి చెక్

మస్కట్:వెజిటెబుల్ మార్కెట్స్ లో స్ట్రీట్ వెంటర్స్ కు చెక్ పెట్టేలా మస్కట్ మున్సిపాలిటీ కొత్త ఆలోచనతో ముందుకువచ్చింది. అసలు స్ట్రీట్ వెంటర్స్ కు సేల్స్ లేకుండా చేయటం ద్వారా
వారి సంఖ్యను గణనీయంగా తగ్గించొచ్చనే నిర్ణయానికి వచ్చింది. అందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్న మున్సిపాలిటీ అధికారులు..ఇక నుంచి వెజిటేబుల్ మార్కెట్స్ లో స్ట్రీట్ వెండర్స్ దగ్గర సరుకులు ఏవీ కొనొద్దని సూచించింది. వాళ్లను పూర్తిగా పట్టించుకోవద్దని పిలుపునిచ్చింది. కన్సూమర్స్ కు నాణ్యమైన సరుకులు అందించే లక్ష్యంతో మున్సిపాలిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఆర్డర్ 847/2017 ప్రకారం మార్కెట్లో సరుకులు అమ్మే ప్రతి ఒక్కరు మున్సిపల్ అథారిటీ నుంచి పర్మిషన్ పొందాల్సి ఉంది. కన్సూమర్స్ సేఫ్టీ, హెల్త్ స్టాండర్స్ మేయిన్టేన్ చేసేందుకు అధికారుల నుంచి గుర్తింపు తప్పని సరి చేసింది. అయితే..స్ట్రీట్ వెండర్స్ ఎలాంటి గుర్తింపు లేకుండా నాసిరకం వస్తువులను అమ్ముతున్నారనే ఆరోపణల నేపథ్యంలో మస్కట్ మున్సిపాలిటీ స్ట్రీట్ వెండర్స్ ఎవౌడ్ చేయాలని సూచించింది.

Back to Top