జంక్‌ఫుడ్‌ వల్లే వ్యాధులు పెరుగుతున్నాయి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

- February 23, 2020 , by Maagulf
జంక్‌ఫుడ్‌ వల్లే వ్యాధులు పెరుగుతున్నాయి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక దేశచరిత్రలోనే తొలిసారిగా.. రైతులకు పద్మ అవార్డులు ఇచ్చారన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో.. పద్మ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమంలో.. వెంకయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పద్మ విభషణ్‌ గ్రహీత పీవీ సింధుతోపాటు పద్మ అవార్డు గ్రహీతలు వెంకట్‌రెడ్డి, భాష్యం విజయ సారథిలను ఉపరాష్ట్రపతి సన్మానించారు. అతి చిన్న వయసులో పద్మ విభూషణ్ అందుకున్నది పీవీ సింధు ఒక్కరేనని వెంకయ్య ప్రశంసించారు.

పాశ్చాత్య పోకడలతో జంక్ ఫుడ్‌కు అలవాటు పడటంవల్లే.. దేశంలో అనేక మందిని వ్యాధులు పట్టిపీడిస్తున్నాయని వెంకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సూచించారు. యువత హింసా మార్గంలో వెళ్లడం దేశానికి శ్రేయస్కరం కాదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు వైద్య సేవలు అందించడమే స్వర్ణభారత్‌ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని.. సమాజసేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com