వీహెచ్‌పీ మోడల్‌లోనే అయోధ్య మందిర్‌..

వీహెచ్‌పీ మోడల్‌లోనే అయోధ్య మందిర్‌..

న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) 30 ఏళ్ల కిందటే ప్రతిపాదించిన రామమందిర నిర్మాణ మోడల్‌లో ఎలాంటి మార్పులూ చేపట్టడం లేదని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ స్పష్టం చేశారు. కోల్‌కతాలో ప్రస్తుతం ఐదు అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు కలిగిన ఫైబర్‌ టెంపుల్‌ కోల్‌కతాలో నిర్మాణ దశలో ఉందని, రామ మందిర నిర్మాణ మోడల్‌లో ఎలాంటి మార్పులు లేవని వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడు చంపత్‌ రాయ్‌ అయోధ్య లోని కరసేవక్‌పురంలో స్పష్టం చేశారు.

మోడల్‌లో మార్పులు కోరుకునేవారు రామ మందిర నిర్మాణాన్ని కోరుకునేవారు కాదని అన్నారు. మోడల్‌లో మార్పులు చేస్తే మందిర నిర్మాణంలో జాప్యం వాటిల్లుతుందని చెప్పుకొచ్చారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ త్వరలో అయోధ్యను సందర్శించి మందిర నిర్మాణంపై సంప్రదింపులు జరపనున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ అధ్యక్షుడు నిత్య గోపాల్‌ దాస్‌తో యోగి ఆదిత్యానాథ్‌ సమావేశమవుతారు. మందిర నిర్మాణం కోసం సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఏడుగురు సభ్యులతో కూడిన ట్రస్ట్‌ ఏర్పాటైన సంగతి తెలిసిందే.

Back to Top