'అరణ్య'లో విష్ణు విశాల్ ఎలిఫెంట్ ఫ్రెండ్ లుక్
- February 23, 2020
హ్యాండ్సం హీరో రానా దగ్గుబాటి తెలుగు, హిందీ, ఇతర భాషల్లో వరుస హిట్లతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆయన నెగటివ్ రోల్లో నటించగా ఇటీవల విడుదలైన బాలీవుడ్ ఫిల్మ్ 'హౌస్ ఫుల్ 4' బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇప్పుడు ఆయన 'హాథీ మేరే సాథీ' అనే బహుళ భాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెలుగులో ఆ సినిమా 'అరణ్య' పేరుతో రిలీజ్ అవుతోంది. దేశంలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల విడుదల చేసిన రానా ఫాస్ట్ లుక్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో మనకు తెలుసు. అడవి మనిషిలా కనిపిస్తున్న రానా అందర్నీ ఆకట్టుకున్నారు.
ఈ చిత్రంలో తమిళ యువ నటుడు విష్ణు విశాల్ కూడా ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇదివరకే ఆయన ఫస్ట్ లుక్ కూడా విడుదలై ఆకట్టుకుంది. తాజాగా చిత్ర బృందం విష్ణు విశాల్ మరో లుక్ ను విడుదల చేసింది. అందులో ఆయన ఒక ఏనుగుపై పడుకొని కనిపిస్తున్నారు. ఈ ఎలిఫెంట్ ఫ్రెండ్ లుక్ లో ఆయన క్యూట్ గా ఉన్నారు. ఆయన పాత్ర ప్రేక్షకులకు బాగా అలరిస్తుందని నిర్మాతలు చెబుతున్నారు.
ఏప్రిల్ 2న 'అరణ్య' రిలీజ్ అవుతోంది. హిందీలో 'హాథీ మేరే సాథీ', తమిళంలో 'కాండన్' పేరుతో వస్తోంది. ఎంతో లావిష్ గా తయారవుతున్న ఈ సినిమాని ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేస్తున్నారు. పర్యావరణం, అడవుల నరికివేత వంటి సమస్యల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది.
జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్ ఇతర ప్రధాన పాత్రధారులు. శంతను మొయిత్రా సంగీతం అందిస్తుండగా, ఎ.ఆర్. అశోక్ కుమార్ సినిమాటోగ్రఫీని సమకూరుస్తున్నారు.
ప్రధాన తారాగణం:
రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్
సాంకేతిక బృందం:
నిర్మాణం: ఈరోస్ ఇంటర్నేషనల్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రభు సాల్మన్
మాటలు, పాటలు: వనమాలి
సినిమాటోగ్రఫీ: ఎ.ఆర్. అశోక్ కుమార్
సంగీతం: శంతను మొయిత్రా
సౌండ్ డిజైన్: రసూల్ పోకుట్టి
ఎడిటింగ్: భువన్
ప్రొడక్షన్ డిజైన్: మయూర్ శర్మ
కాస్ట్యూమ్స్: కీర్తి కొల్వాంకర్, మరియా తారకన్
యాక్షన్: 'స్టన్నర్' శ్యామ్, స్టన్ శివ
అసోసియేట్ ప్రొడ్యూసర్: భావనా మౌనిక
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







