డోనాల్డ్ ట్రంప్ ఇండియా టూర్ షెడ్యూల్

డోనాల్డ్ ట్రంప్ ఇండియా టూర్ షెడ్యూల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24 భారత పర్యటనకు వస్తుండడంతో కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచాన్నే శాసిస్తున్న అమెరికా అధ్యక్షుడికి అతిథి మర్యాదల్లో ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మోతేరా క్రికెట్‌ స్టేడియంలో 'నమస్తే ట్రంప్‌' కార్యక్రమంలో ప్రధాని మోదీ, ట్రంప్‌ పాల్గోనున్నారు. ఈ నేపథ్యంలో నిఘాను మరింత పటిష్టం చేశారు. ట్రంప్‌ టూర్‌ సందర్భంగా అహ్మదాబాద్‌ హోటల్స్‌, రెస్టారెంట్లలో కూడా ప్రత్యేక భద్రతను చేపట్టారు.


ట్రంప్ భద్రత కోసం దాదాపు అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలు పని చేయనున్నాయి. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, పారా మిలటరీ దళాలు భద్రతలో నిమగ్నం కానున్నాయి. డ్రోన్‌ దాడులను తిప్పికొట్టేందుకు డీఆర్‌డీవో రూపొందించిన యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ను వినియోగిస్తున్నారు.

24-02-2020
AM 11:55 అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ట్రంప్‌
ఎయిర్‌పోర్ట్‌ నుంచి మోతెరా స్టేడియం వరకు ర్యాలీ
PM 12:30 మోతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమం
PM 3:30 ఆగ్రా వెళ్లనున్న ట్రంప్
PM 5:10 తాజ్‌మహల్‌ సందర్శన
PM 7:30 ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు ట్రంప్
మౌర్య హోటల్‌లో బస ట్రంప్‌ దంపతుల బస

25-02-2020
AM 9:55 రాష్ట్రపతి భవన్‌కు ట్రంప్
AM 10:45 రాజ్‌ఘాట్‌లో నివాళులు
AM 11:25 హైదరాబాద్‌ హౌస్‌లో మోదీ-ట్రంప్‌ ఉమ్మడి మీడియా సమావేశం
మోదీ, ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు
PM 12:55 అమెరికా ఎంబసీ సిబ్బందితో ట్రంప్‌ భేటీ
PM 8:00 రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌ దంపతులకు విందు
PM 10:00 అమెరికాకు బయల్దేరనున్న ట్రంప్

Back to Top