అగ్ని ప్రమాదం: 36 గంటల తర్వాత దుబాయ్ టవర్‌కి చేరుకున్న టెనెంట్స్
- February 24, 2020
షేక్ జాయెద్ రోడ్డులోని దుజా టవర్స్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం కారణంగా అధికారుల సూచన మేరకు ఆ భవనాన్ని ఖాళీ చేసిన 300 మంది టెనెంట్స్ తిరిగి అదే అధికారుల సూచనతో తమ తమ ఫ్లాట్లలోకి చేరుకున్నారు. మిగిలినవారు కూడా ఆ ఫ్లాట్లలోకి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టెనెంట్స్, తమ అపార్ట్మెంట్లలోకి వెళ్ళేముందు అధికారులు అన్ని ఫ్లాట్లనూ తనిఖీ చేశారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బందికి ఈ సందర్భంగా అందరూ కృతజ్ఞతలు తెలిపారు. టెనెంట్స్ సహకారంతో పరిస్థితిని చాలా వేగంగా చక్కదిద్దగలిగినట్లు అధికారులు చెప్పారు. మరోపక్క, అగ్ని ప్రమాదం కారణంగా టవర్ తాలూకు స్ట్రక్చర్ ఏమీ పాడవలేదని దుబాయ్ మునిసిపాలిటీ ఓ సర్టిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







