అగ్ని ప్రమాదం: 36 గంటల తర్వాత దుబాయ్‌ టవర్‌కి చేరుకున్న టెనెంట్స్‌

- February 24, 2020 , by Maagulf
అగ్ని ప్రమాదం: 36 గంటల తర్వాత దుబాయ్‌ టవర్‌కి చేరుకున్న టెనెంట్స్‌

షేక్‌ జాయెద్‌ రోడ్డులోని దుజా టవర్స్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం కారణంగా అధికారుల సూచన మేరకు ఆ భవనాన్ని ఖాళీ చేసిన 300 మంది టెనెంట్స్‌ తిరిగి అదే అధికారుల సూచనతో తమ తమ ఫ్లాట్లలోకి చేరుకున్నారు. మిగిలినవారు కూడా ఆ ఫ్లాట్లలోకి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టెనెంట్స్‌, తమ అపార్ట్‌మెంట్లలోకి వెళ్ళేముందు అధికారులు అన్ని ఫ్లాట్లనూ తనిఖీ చేశారు. దుబాయ్‌ సివిల్‌ డిఫెన్స్‌ సిబ్బందికి ఈ సందర్భంగా అందరూ కృతజ్ఞతలు తెలిపారు. టెనెంట్స్‌ సహకారంతో పరిస్థితిని చాలా వేగంగా చక్కదిద్దగలిగినట్లు అధికారులు చెప్పారు. మరోపక్క, అగ్ని ప్రమాదం కారణంగా టవర్‌ తాలూకు స్ట్రక్చర్‌ ఏమీ పాడవలేదని దుబాయ్‌ మునిసిపాలిటీ ఓ సర్టిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com