వంశ వృద్ధి కొరకు ఏకంగా 16600 కి.మీ...

- February 24, 2020 , by Maagulf
వంశ వృద్ధి కొరకు ఏకంగా 16600 కి.మీ...

అర్జెంటినా నుండి బార్న్ స్వాలొ అనే చిన్న పక్షి తన జాతిని పెంచుకోడానికి  ఒక్కో సంవత్సరము  ఫిబ్రవరి  నెల లో మొదలై  8300 km ప్రయాణం చేసి మార్చ్  నెల చివరలో  కాలిఫోర్నియా  చేరుకుంటుంది. కాలిఫోర్నియా లో ఒక చర్చి లో నివాసం ఏర్పరుచుకుంటాయి. తన వంశాన్ని  వృద్ధి  చేసుకుని అక్టోబర్ లో తన పక్షి పిల్లలతో తిరుగు ప్రయాణం చేస్తాయి. ఇందులో వింత ఏముంది అంటారేమో కానీ అవి దాదాపుగా 16600 km ప్రయాణం చేస్తాయి అవి ప్రయాణం చేస్తున్న మార్గంలో ఎక్కడ  ఒక్క అడుగు భూమి కనిపించదు ప్రయాణం అంత సముద్రమార్గమే అందుకే అవి అర్జెంటీనాలో  బయల్దేరే  ముందు ఒక చిన్న పుల్లను వాటి సహాయార్థం  తీసుకుంటాయి అవి అలసిపోయినప్పుడు  ఆకలివేసినప్పుడు  ఆ పుల్లను నీటిపైన వేసుకుని సేద తీరుతుంది అలాగే దొరికిన ఆహారంతో  ఆకలి తీర్చుకుని  మళ్ళి ప్రయాణం మొదలెడుతుంది.

ఇలా ఒక చిన్న పుల్ల  ఆధారంతో  చిన్న పక్షి అంత అంత దూరం ప్రయాణం చేయగలుగుతుంది  అంటే అవి వాటిపైన పెట్టుకున్న నమ్మకం పక్షులువాటికే వాటిపైన అంత నమ్మకం ఉన్నప్పుడు దేవుడు మనకు అన్ని అవయవాలు  ఇచ్చాడు మనం కష్టపడి పనిచేయలేమా ఆమాత్రం నమ్మకం మనకు లేక ఇతరులపై  ఎందుకు ఆధారపడడం ప్రయత్నిద్దాం ఓడిపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిద్దాం సాధించలేనిది  ఏది లేదు కదా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com