ప్రసంగంతో అదరగొట్టిన అభిమన్యు

- February 24, 2020 , by Maagulf
ప్రసంగంతో అదరగొట్టిన అభిమన్యు

విజయనగరం: ‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆరో తరగతి విద్యార్థి అభిమన్యు ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. విజయనగరంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అభిమన్యు మాట్లాడుతూ..  విద్యా విధానంలో సంస్కరణలు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భగవంతుడితో సమానమని అన్నాడు. పేదల కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్‌కు విద్యార్థులు, తల్లిదండ్రుల తరఫున ధన్యవాదాలు తెలపడం గౌరవంగా భావిస్తున్నానంటూ ఇంగ్లీష్‌లో ప్రసంగించాడు. ‘‘మాట తప్పను... మడమ తిప్పనని పాదయాత్రలో హామీ ఇచ్చారు. అధికారంలోని వచ్చిన తర్వాత ఆ మాటలను అక్షరసత్యం చేశారు. అమ్మఒడి పథకం తీసుకువచ్చారు. అర్హురాలైన ప్రతీ తల్లికి రూ. 15 వేలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తల్లులు ఎంత అదృష్టవంతులు. ఇక జగనన్న గోరుముద్ద పథకం.. ఒక అమృతభాండం. ఎంతో రుచికరమైన భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు. ఎన్నో వరాలు కురిపిస్తున్నారు. సీఎం జగన్‌ ఆకాంక్షలను విద్యార్థులు నెరవేరుస్తారని నేను మాట ఇస్తున్నా. నేను బాగా చదివి ఐఏఎస్‌ అవుతాను. సీఎం జగన్‌ విష్ణు భగవానుడి స్వరూపం’’అని జెడ్సీహెచ్‌ఎస్‌ విద్యార్థి అభిమన్యు పేర్కొన్నాడు. ఈ క్రమంలో తన ప్రసంగంతో ఆకట్టుకున్న అభిమన్యును సీఎం జగన్‌ దగ్గరకు తీసుకుని ఆశీర్వదించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com