అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ భేటీ
- February 25, 2020
ప్రధాని మోదీ , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హైదరాబాద్ హౌస్‌లో చర్చలు జరుపుతున్నారు. ఆర్థిక, వాణిజ్య, ఐటీ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చిస్తున్నారు. రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటన కూడా చేశారు. దాదాపు 3 బిలియన్ డాలర్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను భారత్‌కు అందిస్తామని ప్రకటించారు.
భారత ప్రభుత్వం కూడా త్రివిధ దళాల బలోపేతానికి అడ్వాన్స్డ్ వెపన్స్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అమెరికా నుంచి MH-60 ఆర్.సి.హాక్ హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని తీర్మానించింది. మరికొన్ని ద్వైపాక్షిక ఒప్పందాలపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేయనున్నారు. చర్చల అనంతరం.. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియా సమావేశంలో పాల్గొంటారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







