ఢిల్లీలో అల్లర్లు..అమిత్ షా సమీక్ష

- February 25, 2020 , by Maagulf
ఢిల్లీలో అల్లర్లు..అమిత్ షా సమీక్ష

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి ఘటనలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఢిల్లీలో ఘర్షణలపై హోంమంత్రి అమిత్ షా సమీక్ష జరిపారు. ఢిల్లీ అధికారులతో చర్చించారు. మరోవైపు ఈశాన్య ఢిల్లీని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సీఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి పునరుద్ధరణ కోసం అందరం కలిసి పనిచేద్దామని పిలుపు ఇచ్చారు. సయంమనంతో ఉండాలని ప్రజలను కోరారు. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈశాన్య ఢిల్లీలో శాంతిభద్రతలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. శాంతి సామరస్యతను కాపాడేందుకు సయంమనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com