భారత్ పర్యటన..ఈ అనుభూతి మర్చిపోలేను..మెలానియా ట్రంప్
- February 25, 2020
భారతదేశ పర్యటనను నా జీవితంలో మర్చిపోలేనిదిగా చెప్పిరు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి రెండోరోజు భారత్‌లో పర్యటిస్తున్న ఆమె... ఓవైపు ప్రధాని నరేంద్ర మోడీతో అధ్యక్షుడు ట్రంప్ చర్చలు జరుపుతున్న సమయంలో.. ఆమె ఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌ను పరిశీలించారు.. మోతిబాగ్‌లోని సర్వోదయ సీనియర్ సెకండరీ స్కూల్‌ను సందర్శించిన ఆమె... విద్యార్థులతో కలిసి ముచ్చటించారు.. స్కూల్‌లోని "హ్యాపినెస్ క్లాస్"లో కూర్చుని విద్యార్ధుల ప్రతిస్పందనను పరిశీలించారు. టీచర్లను అడిగి అక్కడ విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, భోదన తీరును తెలుసుకున్నారు. ఇక, స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. హ్యాపినెస్ క్లాస్‌లు చాలా బాగున్నాయని ప్రశంసించారు.. చక్కటి అవగాహనతో కూడిన విద్యను విద్యార్థులకు అందిస్తున్నారన్న ఆమె... ఇది నా మొదటి భారత పర్యటన.. ఈ పర్యటన నా జీవితంలో మర్చిపోలేనిదిగా అభివర్ణించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







