'తలైవి'లో శశికళ పాత్ర పోషించనున్న 'పూర్ణ'
- February 25, 2020
ఏ.ఎల్.విజయ్ `తలైవి` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. విష్ణు ఇందూరి నిర్మాత. ఇప్పటికే జయలలిత కు సంబంధించి రెండు లుక్ లు రిలీజ్ అయ్యాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ..జయలలితగా నటిస్తోంది. కాగా ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి .. శోభన్ బాబు పాత్రలో జిషు సేన్ గుప్తా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. మరో కీలక పాత్రధారి శశికళగా అందాల నటి పూర్ణ ఎంపికైంది. శశికళ అంటే జయలలితకు ఎంతో క్లోజ్. అమ్మ జీవితంలో చాలా ఇంపార్టెంట్ పాత్ర అది. అందుకే పూర్ణకు నటించేందుకు ఆస్కారం ఉంది. ఇక ఇదే చిత్రంలో ఎంజీఆర్ వైఫ్ జానకి పాత్రలో మధుబాల నటిస్తున్నారు. ఏ.ఎల్. విజయ్ ఈ సినిమా లో పాత్రధారుల్ని ఎంతో ప్రతిష్ఠాత్మకం గా భావించి ఎంపిక చేసుకుంటున్నారు. ప్రధాన పాత్రలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!