తమిళ సినిమా 'ఖైదీ' రీమేక్ లో 'అజయ్ దేవగన్'

- February 25, 2020 , by Maagulf
తమిళ సినిమా 'ఖైదీ' రీమేక్ లో 'అజయ్ దేవగన్'

ఈమధ్య దక్షిణాది సినిమాలు ఉత్తరాది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే పెద్దపెద్ద బాలీవుడ్‌ హీరోలు సైతం ఆ సినిమాల రీమేక్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో పలు సినిమాలు బాలీవుడ్ లోకి రిమేక్ అయ్యాయి. తమిళ నటుడు కార్తీ హీరోగా నటించిన తమిళ మూవీ 'ఖైదీ' మంచి విజయం సాధించడంతో ఆ సినిమాను బాలీవుడ్‌లో రిలియన్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మాణ సంస్థ, డ్రీమ్‌ వారియర్స్‌తో కలిసి రీమేక్‌ చేసే పనిలో పడింది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌ చేస్తున్నట్లు సమాచారం. చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటికే ఆయనను సంప్రదించగా దానికి ఆయన ఓకే చెప్పాడట. మొన్నటి వరకు హృతిక్ రోషన్, రణవీర్ సింగ్ అనకున్నప్పటికీ ఈ అవకాశం అజయ్ దేవగన్ ఎగరేసుకు పోయాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ హీరో వరుస విజయాలు అందుకుంటున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com