కువైట్:డోమస్టిక్ వర్కర్స్ మేలు చేసేలా న్యూ యునిఫైడ్ కాంట్రాక్ట్ పాలసీ

- February 25, 2020 , by Maagulf
కువైట్:డోమస్టిక్ వర్కర్స్ మేలు చేసేలా న్యూ యునిఫైడ్ కాంట్రాక్ట్ పాలసీ

కువైట్:డోమస్టిక్ వర్కర్స్ పూర్తి భద్రత కల్పించేలా న్యూ యూనిఫైడ్ కాంట్రాక్ట్ పాలసీని అమల్లోకి వచ్చింది. ఈ పబ్లిక్ అథారిటీ మ్యాన్ పవర్స్ డొమస్టిక్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. డొమస్టిక్ వర్కర్స్ రిక్రూట్మెంట్ లో కొత్త కాంట్రాక్ట్ ప్రకారం..నివాస, ఆరోగ్య సంరక్షణ బాధ్యత యజమానులదే. నివాసం, ఫుడ్, క్లాత్స్ అందించటంతో వారిని వేధింపులకు గురిచేయకుండా సరిగ్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే డోమస్టిక్ వర్కర్స్ కు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాలి. ప్రతీ నెలాఖరులోనే కాంట్రాక్ట్ లో పేర్కొన్న జీతాన్ని ఖచ్చితంగా చెల్లించాలి. దీంతో పాటు పనివేళల విషయంలోనూ కొత్త కాంట్రాక్ట్ విధానంలోనూ పబ్లిక్ అథారిటీ మ్యాన్ పవర్స్ డొమస్టిక్ పలు సూచనలు చేసింది. రోజుకు 12 గంటలకు మించి పని చేయకూడదని సూచించింది. ప్రతీ ఐదు గంటల పని తర్వాత ఒక గంట విశ్రాంతి కల్పించాలి. రాత్రి సమయంలో ఖచ్చితంగా 8 గంటల విశ్రాంతి ఇవ్వాలి. వారంలో ఒక రోజు సెలవుతో పాటు యాన్యూవల్ లీవ్స్ కి పేమెంట్ చేయాలి. అలాగే ఏడాదిలో ఒక నెల జీతం బోనస్ గా ఇవ్వాలి. వీటితో పాటు డొమస్టిక్ వర్కర్స్ కు చెందిన ఎలాంటి ఐడీ ప్రూవ్స్, డాక్యుమెంట్స్ యజమానులు తమ దగ్గర పెట్టుకోరాదని తెలిపింది. కొత్త కాంట్రాక్ట్ విధానంపై యజమానులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా సంతకం చేయాలి. న్యూ యూనిఫైడ్ కాంట్రాక్ట్ పాలసీ ప్రవాసీయులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com