ఢిల్లీలో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్

- February 25, 2020 , by Maagulf
ఢిల్లీలో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్

ఢిల్లీ: భారత దేశ రాజధాని ఢిల్లీ లో పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఈశాన్య ఢిల్లీ లో పరిస్థితులు ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశం కనపడటం లేదు. దీనితో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారి చేసారు ఢిల్లీ పోలీసులు. ఆందోళనలను అదుపులోకి తీసుకోచ్చేందుకే ఈ నిర్ణయం అని చెప్పారు. సియెఏ వ్యతిరేక వర్గానికి పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ,ముఖ్యంగా చాంద్ బాగ్ లో పరిస్థితులు అదుపు తప్పాయి. ఆందోళన కారులపై భాష్పావాయు గోళాలను పోలీసులు ప్రయోగించారు.

ముఖ్యంగా ఆ ప్రాంత౦ లో షాపులు, బైక్ లకు, కార్ లకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీనితో పరిస్థితి ఒక్కసారిగా ఆందోళన కరంగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ పరిస్తితిపై ఆందోళన వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్ట౦ విషయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. గత నాలుగు రోజుల నుంచి ఇది హింసకు దారి తీసింది. దీనితో ప్రజలు బయటకు రావాలి అంటేనే భయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి.

ఇప్పటికే ఈ ఆందోళనల్లో పది మంది మరణించారు. అందులో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ ఆందోళనలపై కేంద్ర హోం శాఖ, ఢిల్లీ ప్రభుత్వం సమీక్షలు నిర్వహించారు. ఢిల్లీ లా అండ్ ఆర్డర్ కమీషనర్ గా ఆర్ శ్రీవాస్తవ ను నియమించారు. ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాల్లో రేపు స్కూల్స్ కి సెలవు ప్రకటించారు అధికారులు. మొత్తం ఆరు ప్రాంతాల్లో ఈ ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఎప్పుడు ఎం జరుగుతుందా అనే ఆందోళన అక్కడి ప్రజల్లో నెలకొంది. అటు ఢిల్లీ ప్రభుత్వం కూడా దీనిని సమర్ధవంతంగా ఎదుర్కొంటామని చెప్తుంది.పోలీసులు సోషల్‌ మీడియా పుకార్లపై ప్రత్యేక మానిటరింగ్‌ చేపట్టారు. భద్రతా ఏర్పాట్లను 1000 మంది పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com