అమెరికాలో ముగ్గురు తెలుగువాళ్లు మృతి
- February 25, 2020
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్లు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన భార్యాభర్తలతో పాటు ఏపీకి చెందిన మరో వ్యక్తి ఉన్నారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ గాంధీనగర్‌కు చెందిన రాజా గవిని (41), దివ్య ఆవుల (34) భార్యాభర్తలు. వీరిద్దరూ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం తమ కుమార్తె రియాను డ్యాన్స్ క్లాస్ వద్ద విడిచిపెట్టారు. తిరిగి వస్తున్న మార్గంలో స్థానికంగా నిర్మాణం చేపట్టిన తమ సొంత ఇంటిని పరిశీలించేందుకు విజయవాడ ప్రాంతానికి చెందిన స్నేహితుడు ప్రేమ్‌నాథ్ రామనాథం (42)ను తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎఫ్ఎం 423 ఇంటర్సెక్షన్ వద్దకు రాగానే ఈ ముగ్గురూ వెళ్తున్న కారును ఓ ట్రక్ వేగంగా ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!