రస్ అల్ ఖైమా:గ్రీన్ బిల్డింగ్స్ లో పోలీస్ స్టేషన్లు..Dh39 మిలియన్లతో నిర్మాణం
- February 26, 2020
రస్ ఆల్ ఖైమాలో పోలీసులకు త్వరలో మూడు గ్రీన్ బిల్డింగ్ లు సిద్ధం అవుతున్నాయి. పర్యావరణ హితంగా ఉండే పోలీస్ స్టేషన్లలో కస్టమర్ హ్యాపినెస్ సెంటర్ ను కూడా ఉంటాయని, అదే సమయంలో త్వరితంగా ఫిర్యాదుదారులకు సేవలు అందించటంలో దోహద పడుతాయని రస్ ఆల్ ఖైమా జనరల్ కమాండర్ మేజర్ జనరల్ అలి అబ్ధుల్లా బిన్ అల్వాన్ అల్ నువామి తెలిపారు. Dh39 మిలియన్లతో చేపట్టిన న్యూ గ్రీన్ బిల్డింగ్స్ ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి అవుతాయని వెల్లడించారు. ధీట్ ప్రాంతంలో నిర్మిస్తున్న గ్రీన్ బిల్డింగ్ లో పోలీస్ స్టేషన్, RAK పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని కస్టమర్ హ్యాపినెస్ సెంటర్, K9 సెక్యూరిటీ ఇన్స్ పెక్షన్ సెక్షన్ విభాగానికి చెందిన బిల్డింగ్ లు ఉంటాయి. కస్టమర్స్ హ్యాపినెస్ సెంటర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎంట్రెన్స్ లో ఉంటుందని..ఈ విభాగంలో పోలీస్ స్టేషన్ కు వచ్చే వారికి అవసరమైన సహాయం అందుతుందని అధికారులు తెలిపారు. అలాగే K9 సెక్యూరిటీ విభాగంలో అత్యాధునిక స్టాండర్డ్స్ కలిగిన తనిఖీ కేంద్రంగా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ బిల్డింగ్ తో వాటర్, విద్యుత్ వాడకం గణనీయంగా తగ్గనుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు