ఇక బెగ్గర్ ఫ్రీ నగరంగా భాగ్యనగరం!

- February 26, 2020 , by Maagulf
ఇక బెగ్గర్ ఫ్రీ నగరంగా భాగ్యనగరం!

హైదరాబాద్‌:బెగ్గర్ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేలా జీహెచ్‌ఎంసీ కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకుగాను బిక్షగాళ్ల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఏడు అంశాలను పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు.

1. పోలీస్, ఎన్జీవీవో, కమ్యూనిటీ, ఇతర ఏజెన్సీల సహకారంతో సర్వే చేసి యాచకులను గుర్తించడం
2. యాచకులను కేటగిరీల వారీగా.. పిల్లలు, మానసిక వ్యాధిగ్రస్తులు, సీనియర్ సిటిజెన్స్, దివ్యాంగులు, అనాథలు, కుటుంబాలున్నవారు, పనిచేయగల వ్యక్తులుగా విభజించడం
3. సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులలో వైద్య పరీక్షలు చేయించడం
4. కేటగిరీల వారీగా అందరికీ కౌన్సిలింగ్ నిర్వహణ
5. మానసిక వ్యాధిగ్రస్థులకు ఉచిత భోజన, వసతి కల్పించుట
6. యాచకులందరికీ సమగ్ర పునరావాసం
7. ఈ కార్యక్రమాలను పటిష్ఠంగా అమలు చేసేందుకు నిధుల సమీకరణ

ఈ కార్యచరణను పక్కాగా అమలు పరిచేందుకు కార్పొరేటర్లు, పోలీస్ శాఖ, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు, ఐసీడీఎస్ ఉద్యోగులు, ముఖ్యంగా ఎన్జీవోలు, సంక్షేమ శాఖల ప్రతినిధులను భాగస్వాములను చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. వీరితో కమిటీలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ కమిషనర్లను కూడా ఆదేశించారు. ఈ కార్యాచరణను అమలు చేసేందుకు ఈ నెల 28లోపు డిప్యూటీ కమిషనర్లతో మానిటరింగ్ చేయాలని జోనల్ కమిషనర్లకు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com